Site icon NTV Telugu

Prabhas: మాల్దీవుల్లో ప్రభాస్ ఎంగేజ్ మెంట్.. ఆపండ్రా బాబు

Prabhas

Prabhas

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్ మెంట్.. మాల్దీవుల్లో ప్రభాస్ ఎంగేజ్ మెంట్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన థంబ్ నెయిల్స్ ఇవన్నీ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏ ముహూర్తానా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. ప్రభాస్- కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు జోక్ చేసాడో అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు అనే వ్యక్తి.. వచ్చేవారం మాల్దీవుల్లో ప్రభాస్- కృతి సనన్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నట్లు ఒక ట్వీట్ వేయడం.. అది కాస్తా వైరల్ గా మారడం జరిగింది. ఇదే నిజమనుకొని ప్రభాస్ అభిమానులు.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ కూడా పెట్టుకొచ్చేస్తున్నారు. అయితే ఆ ట్వీట్ లో నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పందించింది. ప్రభాస్- కృతి సనన్ ఎంగేజ్ మెంట్ వార్తలు అన్ని అవాస్తవమని చెప్పుకొచ్చారు.

Bandla Ganesh: బండ్ల గణేష్ ను మోసం చేసింది ఎవరు..?

“ప్రభాస్- కృతి సనన్ మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు. వారిద్దరూ కూడా ఎన్నోసార్లు తాము స్నేహితులమని చెప్పుకొచ్చారు.. ఆ రూమర్స్ ను నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇక ఆపండ్రా బాబు.. పెళ్లి లేదు ఏం లేదు.. అంటూ ప్రభాస్ అభిమానులు ఆ వార్తలను ఖండిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరోపక్క ఈ మధ్యనే ప్రభాస్ జ్వరం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ను అభిమానులు ఒకటే కోరుకుంటున్నారు. ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టాలంటే పెళ్లి వార్త ఈ ఏడాది అయినా చెప్పు అన్నా అంటూ మనవి చేసుకుంటున్నారు. మరి డార్లింగ్ ఈ ఏడాది అయినా రాణి ఎవరో చెప్తాడో లేదో చూడాలి.

Exit mobile version