యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూల మీద ఇంటర్వూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు చిత్ర బృందం. రాధేశ్యామ్ రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇక రొమాంటిక్ సినిమా అంటే కొద్దిగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం సహజమే.. అనుకున్నట్లుగానే ఇంటెన్సివ్ సీన్స్ ఇందులో ఉన్నాయని ప్రభాస్ రివీల్ చేశాడు. పూజా తో ప్రభాస్ లిప్ లాక్ కూడా ఉండబోతున్నాడట. ఇప్పటివరకు డార్లింగ్ కిస్ సీన్లలో నటించింది లేదు. బిల్లా.. పౌర్ణమి సినిమాలో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నా అవన్నీ డూప్ తో సర్దేసినవే.. ఇక ఇప్పుడు కూడా డూప్ అంటే కష్టమే అనుకున్నాడో ఏమో.. ఈసారి ప్రభాస్ కాస్తా దైర్యం చేసి పూజా పెదవి అందుకున్నాడట.
ఇక ఈ విషయం గురించి ప్రభాస్ మాట్లాడుతూ” నాకు అందరిముందు రొమాంటిక్ సన్నివేశాలు చేయాలంటే చాలా సిగ్గు.. ఇక ఈ సినిమా రొమాంటిక్ సన్నివేశాలతో కూడుకున్నది. దీంతో ఆ సన్నివేశాలు చేయాలన్నప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ స్పేస్ లో చేస్తానని చెప్పాను. అందుకు దర్శకుడు ఓకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సన్నివేశాలు కానిచ్చేశాను.. కొన్ని సన్నివేశాల్లో షర్టు లేకుండా చేసినప్పుడు కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ లో చేశాను” అని చెప్పుకొచ్చాడు. సహజంగానే డార్లింగ్ సిగ్గరి.. ఇక ఇలాంటి సీన్స్ అంటే ఆ మాత్రం సిగ్గు, బిడియం ఉంటుందిలే.. మరి ఈ సీన్లు థియేటర్లో ఎలాంటి రచ్చ చేస్తాయో చూడాలి.
