Site icon NTV Telugu

Prabhas: ఏపీ టికెట్ రేట్ ఇష్యూ.. డార్లింగ్ ఏమన్నాడంటే..?

prabhas

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపైనే అందరి చూపు ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ.. ఎన్నో ఏళ్ల తరువాత డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తుండగా.. మరికొంతమంది ఈ సినిమాపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజగా రాధేశ్యామ్ ప్రమోషన్ లో ప్రభాస్ కి ఇదే ప్రశ్న ఎదురయ్యింది.. ఏపీ ప్రభుత్వం మీ సినిమా టికెట్ రేట్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది అన్న ప్రశ్నకు ప్రభాస్ సంధానం చెప్తూ..” ఈ విషయలాన్ని మా నిర్మాత వంశీ చూసుకుంటున్నాడు.. అది ఆయననే అడగాలి” అన్నారు.. మొన్న మీరు కూడా జగన్ ని కలిశారు కదా.. ఏం అనుకుంటున్నారు అని అడగగా.. మంచి జరగాలనే కోరుకుంటున్నాం.. వస్తే బావుంటుంది అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరి టికెట్ రేట్స్ ఇష్యూ పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో చూడాలి.

Exit mobile version