Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన రెండు మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఫౌజీ, కల్కి2 షూటింగ్‌తో పాటు స్పిరిట్ కూడా షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాల షూటింగ్‌ను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తు వస్తున్నాడు ప్రభాస్. అయితే, ‘స్పిరిట్’ విషయంలో మాత్రం డార్లింగ్ రూట్ మార్చాడు. ప్రస్తుతానికి మిగిలిన సినిమాలను పక్కనపెట్టి, కేవలం స్పిరిట్ కోసమే 60 రోజుల భారీ నాన్-స్టాప్ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. బాహుబలి తర్వాత చాలా ఏళ్లకు ప్రభాస్ ఒకే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం విశేషం. సందీప్ వంగా మార్క్ ఇంటెన్సిటీని మ్యాచ్ చేసేందుకు డార్లింగ్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ సెట్లో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్లో భాగంగా నాలుగు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కథకు కీలకమైన ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక ‘రా’ అండ్ ఇంటెన్స్ కలిగిన IPS ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పవర్ఫుల్ పోలీస్ పాత్ర కోసం ప్రభాస్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటికే ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్న ఆయన, పక్కా ప్లానింగ్‌తో షూటింగ్లో పాల్గొంటున్నారు. సందీప్ మేకింగ్ స్టైల్‌కి తగ్గట్టుగా ఈ సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసి, అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!