‘సాహో’ తోనే సిగ్గు పోయింది అనుకున్నాను- ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. పాన్ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ” ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఇది మాములు లవ్ స్టోరీ కాదు… పెదనాన్నగారి ఫోటో చూశారు కదా.. చిన్నపాటి దేవుడిలా ఉన్నారు కదా.. గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది.. పెదనాన్న గారి మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి పెద్ద సినిమాలు చేశారు.. ఆ తరువాత బిల్లా తీశారు. అది బాగానే ఆడింది. ఇక ఇప్పుడు రాధేశ్యామ్.. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీనే కానీ .. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. పూజా ఈ సినిమాలో చాలా బాగా నటించింది.
డైరెక్టర్ రాధా గురించి చెప్పాలంటే.. 5 ఏళ్లు సినిమాలో కూర్చోడమంటే జోక్ కాదు.. సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో సాహో వలన ఆగి , ఇంకొన్ని రోజులు కరోనా వలన ఆగి .. చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. క్లయిమాక్స్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సాహో సమయంలో ఇండియా అంతా తిరిగి సిగ్గుపోయి .. ఈ ఈవెంట్ లో బాగా మాట్లాడేస్తాను అనుకున్నాను.. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాన.. కానీ నా సిగ్గు పోలేదండి .. ఇక ఇది పోదేమో .. ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం అభిమానులే లవ్ యూ సోమచ్ ” అని ముగించారు.
Also Read
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!