Prabhas : టాలీవుడ్‌లో ప్రజెంట్ ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. అదే “ప్రభాస్ సెంటిమెంట్”. రెబల్ స్టార్ ప్రభాస్ ఏ మూవీకి సాయం చేస్తే అది హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇదే సెంటిమెంట్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా కాంతపై కూడా పనిచేస్తుందా అనే టాక్ మొదలైంది. ఇప్పటివరకు ప్రభాస్ సాయం చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. మిరాయ్ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా కాంతార ట్రైలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేయగా, ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది.
Read Also : Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇప్పుడు అదే జోష్‌లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత సినిమా ట్రైలర్‌ను కూడా ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. దుల్కర్ లుక్, కథలోని ఎమోషనల్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ చూసి సినీ వర్గాల్లో “ప్రభాస్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా?” అనే చర్చ మొదలైంది. గత సినిమాల మాదిరిగా కాంత కూడా భారీ హిట్ అవుతుందా లేదా అన్నది విడుదల తర్వాత తెలిసినా.. ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం సినిమాకు అదనపు బజ్‌ను క్రియేట్ చేసిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మూవీ నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది.
Read Also : SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్
