Site icon NTV Telugu

Prabhas :ప్రభాస్ నో అంటే చిరు యస్ అన్నాడా?

New Project (24)

New Project (24)

‘ఆచార్య’తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్‌లకోసం కూడా తాపత్రయపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి ‘విక్రమ్’ సినిమా చూసి కమల్ హాసన్ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ని ఆహ్వానించి అభినందించారు. అంతే కాదు అదే మీట్ లో ప్రభాస్‌కు లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడట. అయితే ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ నిరాకరించిన విషయం తెలిసినదే. అయితే ఆ కథలో కొన్ని మార్పులు ఉంటే బాగుంటుందని చెప్పటమే కాదు యస్ అంటే తనతో కానీ రామ్ చరణ్‌తో కానీ సినిమా తీయవచ్చని సూచించాడట.

నిజానికి ఇప్పటికే అల్లు అర్జున్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా లోకేశ్‌ కనకరాజ్ తో జోడీ కట్టాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ విషయంలో చిరు ఓ అడుగు ముందుకు వేసి రెడీగా ఉన్న ప్రభాస్ కోసం రాసిన కథను చిన్న మార్పులతో ఓకే చేయటం గమనించదగ్గ విషయం. ఒక వేళ ఇదే నిజమైతే చిరంజీవికి వరుస సినిమాలు ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ అటు లోకేష్‌ కనకరాజ్ తో పాటు ఇటు చిరంజీవి ఖాతాలో కూడా ఆసక్తికరమైన లైనప్ ఉంది. మరి వీరిద్దరి కాంబినేషన్ సెట్స్‌పైకి రావాలంటే చాలా టైమ్ పట్టే సూచనలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!?

Exit mobile version