Site icon NTV Telugu

Salaar: 90 సెకండ్స్ టీజర్ లాక్… రికార్డ్స్ అన్నీ బ్రేక్?

Salaar

Salaar

ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ అవైటేడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రభాస్ నటిస్తున్న సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తమ హీరో కటౌట్‌కి ఇచ్చే ఎలివేషన్‌ను ఇప్పటి నుంచే ఊహించుకుంటు, ప్రభాస్ ఫాన్స్ బాక్సాఫీస్ లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సలార్ టీజర్ టైం ఫిక్స్ అయిందనే న్యూస్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జూలై ఫస్ట్ వీక్‌లో సలార్ టీజర్ బయటకి రానుందని అంటున్నారు. జూలై 7న టీజర్ టైం ఫిక్స్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటికే సలార్ టీజర్ రన్ టైం కూడా లాక్ అయినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక నిమిషం 30 సెకన్లుగా ఈ టీజర్‌ను సాలిడ్‌గా కట్ చేశారట. ఈ 90 సెకన్ల టీజర్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో, గూస్ బంప్స్ వచ్చేలా ప్రభాస్‌ను మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్.

యూనివర్సల్ లెవల్లో రానున్న ఈ టీజర్.. వెయ్యి కోట్ల విధ్వంసానికి నాంది అని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఒక్కసారి ఈ టీజర్ బయటికొస్తే.. సలార్ లెక్కలన్నీ మారిపోనున్నాయి. ట్రేడ్ వర్గాలు కూడా బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో పడబోయే వెయ్యి కోట్ల బొమ్మ ఇదేనని ఫిక్స్ అయిపోయాయి. ఇదిలా ఉండగానే.. ఓవర్సీస్‌లో సలార్‌కి మాసివ్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వారు. సలార్ చిత్రానికి మాసివ్ రిలీజ్ ఉంటుంది, కింగ్ వస్తున్నప్పుడు కింగ్ సైజ్ రిలీజే ఉంటుంది ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సలార్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఏదేమైనా.. సలార్ టీజర్ దెబ్బకు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం గ్యారెంటీ.

Exit mobile version