NTV Telugu Site icon

Salaar: రికార్డులు ఉంటే రాసి పెట్టుకోండి… 250 రోజుల్లో అన్నీ లేస్తాయ్…

Salaar

Salaar

KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. “An Action Saga #Salaar అంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసిన ప్రశాంత్ నీల్, మోస్ట్ వయోలెంట్ మాన్ అంటూ రచ్చ చేశాడు. ప్రభాస్ గన్ను పట్టుకున్న పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అప్పటివరకూ ఒక సినిమా అనౌన్స్మెంట్ ఇండియాలోనే హాట్ టాపిక్ అవ్వడం అదే మొదటిసారి. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు అనే వార్త వినిపిస్తోంది.

సలార్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటివరకూ 90% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వీలైనంత త్వరగా సలార్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టడానికి ప్రశాంత్ నీల్ వెయిట్ చేస్తున్నాడు. అన్ని పనులు కంప్లీట్ చేసుకోని సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి… కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చెయ్యగల సత్తా ఉన్న సలార్ మూవీ నేటి నుంచి సరిగ్గా 250 రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 250 రోజుల్లో సలార్ యుఫోరియా ఎలా ఉంటుందో చూస్తారు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో సలార్ హాష్ ట్యాగ్ #SalaarEuphoriaIn250Days సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఫాన్స్ అంతా యాక్టివ్ మోడ్ లోకి వచ్చి ట్వీట్స్ చేస్తున్నారు.

Show comments