Site icon NTV Telugu

Prabhas: ‘సలార్’ రన్ టైం లీక్… ఎన్ని గంటల విధ్వంసం?

Salaar Rights

Salaar Rights

కెజియఫ్‌ సినిమాలో కాళిమాత సాక్షిగా గరుడను వేసేసి… క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పించాడు రాఖీభాయ్. ఇప్పుడు సలార్‌లో కూడా కాళిమాత సాక్షిగా ప్రభాస్ చేసే ఊచకోత మామూలుగా ఉండదని తెలుస్తోంది. సలార్ ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. కాళీమాత విగ్రహం ముందు ప్రభాస్ విలన్లతో పోరాడే సన్నివేశం.. నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందట. ఇక్కడి నుంచి ప్రభాస్ వర్సెస్ విలన్ వార్ పీక్స్‌కు వెళ్తుందనే టాక్ నడుస్తోంది. అసలు సలార్ అంటేనే… అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే, సలార్ భాయ్ ఎంత సేపు స్క్రీన్ పై ఉంటాడు? సలార్ రన్ టైం ఎంత? అనేదే ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రభాస్ చేస్తున్న ఊరమాస్ సినిమా కాబట్టి ఈ సినిమా రన్ టైం ఎంతున్న పర్లేదనే ఫీలింగ్‌లో ఉన్నారు ఫ్యాన్స్.

మామూలుగానే ఈ మధ్య వస్తున్న పెద్ద సినిమాలన్నీ దాదాపు మూడు గంటల రన్‌ టైంతో వస్తున్నాయి. సలార్ కూడా ఈ లిస్ట్‌లోనే చేరబోతోంది. సోషల్ మీడియాలో సలార్ రన్ టైం లీక్ అయిందనే న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. సలార్ నిడివి ఏకంగా 3 గంటలు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నుంచి ఓ 5, 10 నిమిషాలు ట్రిమ్ చేసి 3 గంటల రన్ టైమ్‌ లాక్ చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలో నిజముందా లేదా అనే డౌట్స్ అక్కర్లేదు. ఖచ్చితంగా సలార్ సినిమా 3 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పక్కా. సెప్టెంబర్ 28న సలార్‌ సీజ్ ఫైర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే సలార్ ఫస్ట్ సింగిల్, ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు హోంబలే ఫిల్మ్స్ వారు. మరి సలార్ ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version