Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అమ్మాయిలకు పిచ్చ క్రేజ్. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. అటు హీరోయిన్లకు కూడా చాలా ఫేవరెట్. ఆయనతో కలిసి నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఓపెన్ గానే స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇంకొందరు అయితే ఛాన్స్ ఇస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటామని.. ఇంకొందరేమో డేట్ చేస్తామని కూడా అన్నారు. ఇంత మంది మెచ్చే ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఒకరున్నారు. హీరోయిన్లు ప్రభాస్ ను ఫేవరెట్ హీరోగా చూస్తే.. మన డార్లింగ్ మాత్రం బాలీవుడ్ ముద్దుగుమ్మ తన ఫేవరెట్ గా చేసుకున్నాడు. ఆమె ఎవరో కాదు దీపిక పదుకొణె. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్వయంగా తెలిపాడు.
Read Also : Pawankalyan : ప్రతిసారి ఆ హీరోలతో పోల్చుకుంటున్న పవన్.. ఎందుకు..?
బాహుబలి కంటే ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే.. తడబడకుండా దీపిక పేరు చెప్పేశాడు. ఒక్కసారి అయినా ఆమెతో నటించాలని ఉందన్నాడు. అనుకున్నట్టు గానే కల్కి సినిమాలో ఇద్దరూ నటించారు. దీపిక పదుకొణె పెళ్లికి ముందు వరకు బాలీవుడ్ ను ఊపేసింది. అగ్ర హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ప్రియాంకచోప్రా, దీపిక మధ్య నెంబర్ వన్ పోరు కొన్నేళ్లు జరిగింది. అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్న దీపిక.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్-అట్లీ మూవీలో నటిస్తోంది. త్వరలోనే కల్కి-2లో కూడా నటించబోతోంది.
Read Also : HHVM vs Kingdom : వీరమల్లు దెబ్బకు అయోమయంలో కింగ్ డమ్..!
