Site icon NTV Telugu

ప్రభాస్ విడుదల చేసిన ‘రొమాంటిక్’ ట్రైలర్

పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టైటిల్‌కి అనుగుణంగా ఈ రొమాంటిక్ ట్రైలర్‌లో ప్రధాన జంట రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. ఓ యువ జంట మధ్య స్వచ్ఛమైన ప్రేమకి శారీరక ఆకర్షణ మధ్య సంఘర్షణగా ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా అది మోహంగా భావిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. లీడ్ పెయిర్ మధ్య బోల్డ్ రొమాంటిక్ సీన్స్ తో యూత్‌ఫుల్‌గా ఉండి యువతను ఆకట్టుకునే ఉంది. ఇక రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంటోంది. పూరి డైలాగ్‌లు, సునీల్ కశ్యప్ థీమ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. మొత్తానికి ఈ రొమాంటిక్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పాలి. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29 విడుదల కానుంది.

Exit mobile version