ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో… సరిగ్గా అలాంటి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయడం లేదేంటి? సినిమా రిలీజ్‌కు మరో 8 రోజులు మాత్రమే ఉంది? ప్రభాస్ ఇంకెప్పుడు మీడియా ముందుకు వస్తాడు? అసలు సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుందా? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు కానీ ప్రమోషన్స్ విషయంలోప్రశాంత్ నీల్ స్ట్రాటజీ వేరేలా కనిపిస్తోంది. సలార్ సినిమా పై ఉన్న హైప్‌కు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా… ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసిన వసూళ్ల వర్షం కురవడం గ్యారెంటీ. ఇదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టున్నాడు నీల్ మావా. అయినా కూడా కనీసం ఒకటి రెండు ఇంటర్య్వూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా చేయాల్సి ఉంటుంది కాబట్టి.. రేపో మాపో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పుడు ఈ పవర్ హౌజ్ కాంబోకి తోడుగా రాజమౌళి కూడా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు జక్కన్న. సాహో, రాధే శ్యామ్ సినిమాల సమయంలో ప్రభాస్‌తో ఇంటర్వూలు చేశాడు రాజమౌళి. ఇక ఇప్పుడు సలార్ కోసం రాజమౌళితో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సలార్ టీమ్… అంటే, ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్‌ని ఇంటర్వ్యూ చేయనున్నాడట రాజమౌళి. ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ఈ పాన్ ఇండియా దిగ్గజాల నుంచి ఒక్క ఇంటర్య్వూ బయటికి వస్తే చాలు… ఆటోమేటిక్‌గా సలార్ హైప్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోతుంది. లేదంటే… ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జక్కన్న చీఫ్ గెస్ట్‌గా వచ్చినా చాలు… సలార్ దుమ్ములేచిపోతుంది. మరి ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఏం చేస్తారో చూడాలి.
