Site icon NTV Telugu

Maruthi: ప్రభాస్ ప్రశాంతంగా ఉండమన్నారు..

Maruthi

Maruthi

టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్. అన్ కాంప్రమైజ్డ్ గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు డైరెక్టర్ మారుతి.

Also Read :Director Maruthi: ‘రాజాసాబ్’ సినిమా నుంచి నేర్చుకుంది ఇదే: డైరెక్టర్ మారుతి

“రాజా సాబ్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా 200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేయడం హ్యాపీగా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద ఇంత హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సంక్రాంతి హాలీడేస్ లో మరింతగా మా మూవీకి ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. సైకలాజికల్ ఎలిమెంట్స్ తో కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే అనుకున్నాం. ప్రభాస్ గారు కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్, మనం కొత్త ప్రయత్నం చేశాం. కొంత టైమ్ పడుతుంది ఆడియెన్స్ కు చేరడానికి అని చెప్పారు. రీసెంట్ గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పారు. అని చెప్పుకొచ్చారు మారుతి.

Exit mobile version