ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో ఉన్న కథతో… ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసాడు. ఈ ఖాన్సార్ ప్రపంచానికి యువరాజు వరదరాజ మన్నార్ అయితే కమాండర్ ఇన్ ఫోర్స్ ది వయొలెంట్ మ్యాన్ సలార్ ‘దేవరథ’. ఈ కమాండర్ అండ్ ప్రిన్స్ మధ్య బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కి సెట్ చేసిన ప్రశాంత్ నీల్… కథని ఈ ఇద్దరి ఎమోషన్ పైనే నడిపించాడు. పృథ్వీరాజ్ కి కష్టం వస్తే… దుర్యోధనుడి కోసం కర్ణుడు వచ్చినట్లు, అర్జునుడి కోసం శ్రీకృష్ణుడు వచ్చినట్లు ప్రభాస్ వస్తాడు. ఈ కోర్ పాయింట్ పైనే సలార్ సీజ్ ఫైర్ సినిమా సాగింది. ఇంతటి స్నేహితులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు అనే దానిపైనే సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం తెరకెక్కుతుంది. మొదటి పార్ట్ వరకు ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ లు మంచి ఫ్రెండ్స్ గానే కనిపిస్తారు. అయితే సినిమా మొత్తంలో పృథీరాజ్ ని సైలెంట్ గా పెట్టి ప్రభాస్ తో ఫైట్ చేయించిన ప్రశాంత్ నీల్… సరిగ్గా క్లైమాక్స్ కి వచ్చే సరికి ఒక కొత్త పృథ్వీరాజ్ ని చూపించాడు.
పృథ్వీరాజ్ కి సాలిడ్ ఫైట్ పెట్టాడు. ట్రైలర్ లో ప్రభాస్-పృథ్వీరాజ్ కలిసి కనిపించే సీక్వెన్స్ క్లైమాక్స్ ఫైట్ కి సంబంధించినదే. ఈ ఫైట్ సీన్ లో పృథ్వీరాజ్-ప్రభాస్ మధ్య డైలాగ్స్ కూడా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునేలా ఉంటాయి. ఒక చోట పృథ్వీరాజ్ కొంతమంది రౌడీలని నరుకుతాడు, అప్పుడు ప్రభాస్ చప్పట్లు కొడతాడు. దీనికి పృథ్వీరాజ్ విజిల్ రాదా అని ప్రభాస్ ని అడగడం ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బాగా ప్రెజెంట్ చేసింది. ఈ సీన్ అవ్వగానే పృథ్వీ రాజ్ గాల్లోకి ఎగిరి చాలా మంది రౌడీలని ఒకటే సారి చంపేస్తాడు, ఈ టైమ్ లో ప్రభాస్ గట్టిగా ఒక విజిల్స్ వేస్తాడు. ఈ విజిల్ ని ప్రభాస్ మాత్రమే కాదు థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరూ వేసారు. మాస్ సినిమాలో ఉండే గొప్పదనం ఇదే, ఆడియన్స్ ని ఒక్కటి చేయగల సీన్ పడితే చాలు థియేటర్స్ ఎరప్ట్ అవుతాయి.