NTV Telugu Site icon

Project K: సలార్ రూట్‌లో ప్రాజెక్ట్ K… టైటిల్ తో పాటు ఆ అనౌన్స్మెంట్ కూడా?

Project

Project

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ K పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి రూట్‌లోనే వెళ్తున్నాయి. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు ప్రభాస్, రాజమౌళి. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలతో పాటు… సీక్వెల్ సినిమాలు కూడా ఎక్కువైపోయాయి. బాహుబలి తర్వాత వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కెజియఫ్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కూడా టు పార్ట్స్‌గానే వస్తోంది. ప్రజెంట్ పుష్ప2 సెట్స్ పై ఉంది. మణిరత్నం కూడా పొన్నియన్ సెల్వన్‌ను రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ రెండు సినిమాలతో వరుసగా రెండు భాగాలతో రాబోతున్నాడు.

ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీని టు పార్ట్స్‌గా చేస్తున్నట్టు.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సలార్ టీజర్‌తో చెప్పేశారు. ఫస్ట్ పార్ట్ ‘సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్’ పేరుతో రాబోతోంది. సెప్టెంబర్ 28న సలార్1 రిలీజ్‌ కానుంది. వచ్చే సమ్మర్‌లో సలార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక సలార్ తర్వాత పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతోంది ప్రాజెక్ట్ కె. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోందట. చాలా రోజులుగా ఈ న్యూస్ వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు ప్రాజెక్ట్ కె మేకర్స్ టు పార్ట్స్‌గా ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. జూలై 20న ప్రాజెక్ట్ కె టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అదే రోజు రెండు భాగాలుగా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఫస్ట్ పార్ట్‌లో కమల్ హాసన్‌ క్యారెక్టర్‌కు లీడ్ ఇస్తూ.. సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ వర్సెస్ కమల్ వార్ ఓ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే మూడు సినిమాలు, రెండు భాగాలుగా చేసిన హీరోగా ప్రభాస్ నిలవనున్నాడని చెప్పొచ్చు.

Show comments