Site icon NTV Telugu

Prabhas: వి మిస్ యూ.. పునీత్‌ను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్

Prabhas

దక్షిణాదిలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన “జేమ్స్” చిత్రంతో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” మూవీ టీజర్‌ను మేకర్స్ నిన్న ఆవిష్కరించారు. ఇందులో పునీత్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆయన అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో పునీత్ ను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు

ప్రభాస్ తన సోషల్ మీడియాలో పునీత్ పోస్టర్‌ను ఎమోషనల్ నోట్‌తో పంచుకున్నాడు. “మేము జేమ్స్ రూపంలో ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామని అనుకుంటున్నాను. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సర్‌ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము!” అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘జేమ్స్’ మూవీ మార్చి 17న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” మార్చి 11న విడుదల కానుంది.

Exit mobile version