Site icon NTV Telugu

Radhe Shyam : రిజల్ట్ పై ప్రభాస్ కామెంట్స్

Prabhas

Prabhas

“రాధేశ్యామ్”తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి సినీ వర్గాలు. అయితే ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉండిపోయిన ప్రభాస్ తాజాగా ‘రాధేశ్యామ్’ గురించి స్పందించారు.

Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం

ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్లాప్ కావడానికి గల కారణం ఏంటో చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమాలు సందడి గురించి కూడా రెబల్ స్టార్ ఓపెన్ అయ్యారు. “టెలివిజన్ స్క్రీన్‌పై చూసి ‘రాధే శ్యామ్‌’ని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. మహమ్మారి కారణంగా ప్రజలు టెలివిజన్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చాలా సినిమాలు చూస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని సినిమాను ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టకపోవడానికి కరోనా లేదా స్క్రిప్ట్‌లో ఏదైనా మిస్ అయ్యి ఉండవచ్చు. లేదా ఆ జోనర్ లో నన్ను చూడాలని ప్రేక్షకులు అనుకోవట్లేదేమో. అనుకున్నా నేను మరింత బాగుండాలని అనుకొని ఉంటారు.

రాజమౌళి నన్ను ‘బాహుబలి’గా ప్రపంచానికి పరిచయం చేశారు. కొంతమంది నన్ను అలాంటి పాత్రలో మాత్రమే చూడాలనుకుంటున్నారు. సినిమాలకు ‘బాహుబలి’ లాంటి మంచి రెస్పాన్స్ రావాలనే ఒత్తిడి నా దర్శకులు, నిర్మాతలపై ఉంది. ‘బాహుబలి’ని క్రాస్ చేయాలనీ, అతి పెద్ద సినిమా చేయాలనీ నాకు అంత ఒత్తిడి లేదు. ‘బాహుబలి’ సినిమా రావడం నా అదృష్టం… కానీ విభిన్నమైన పాత్రల్లో, మంచి కంటెంట్ తో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version