Radhe Shyam : రిజల్ట్ పై ప్రభాస్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“రాధేశ్యామ్”తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి సినీ వర్గాలు. అయితే ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉండిపోయిన ప్రభాస్ తాజాగా ‘రాధేశ్యామ్’ గురించి స్పందించారు.
Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్లాప్ కావడానికి గల కారణం ఏంటో చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమాలు సందడి గురించి కూడా రెబల్ స్టార్ ఓపెన్ అయ్యారు. “టెలివిజన్ స్క్రీన్‌పై చూసి ‘రాధే శ్యామ్’ని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. మహమ్మారి కారణంగా ప్రజలు టెలివిజన్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చాలా సినిమాలు చూస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని సినిమాను ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టకపోవడానికి కరోనా లేదా స్క్రిప్ట్‌లో ఏదైనా మిస్ అయ్యి ఉండవచ్చు. లేదా ఆ జోనర్ లో నన్ను చూడాలని ప్రేక్షకులు అనుకోవట్లేదేమో. అనుకున్నా నేను మరింత బాగుండాలని అనుకొని ఉంటారు.
రాజమౌళి నన్ను ‘బాహుబలి’గా ప్రపంచానికి పరిచయం చేశారు. కొంతమంది నన్ను అలాంటి పాత్రలో మాత్రమే చూడాలనుకుంటున్నారు. సినిమాలకు ‘బాహుబలి’ లాంటి మంచి రెస్పాన్స్ రావాలనే ఒత్తిడి నా దర్శకులు, నిర్మాతలపై ఉంది. ‘బాహుబలి’ని క్రాస్ చేయాలనీ, అతి పెద్ద సినిమా చేయాలనీ నాకు అంత ఒత్తిడి లేదు. ‘బాహుబలి’ సినిమా రావడం నా అదృష్టం… కానీ విభిన్నమైన పాత్రల్లో, మంచి కంటెంట్ తో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!