Prabhas : బాహుబలి ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆరడుగుల అందగాడు పెళ్లి పీటలు ఎక్కితే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వార్త ఆయన పెళ్లిపై వస్తూనే ఉంటుంది. పలానా హీరోయిన్ తో ఫిక్స్ అయిందని.. అమెరికా సంబంధం అని.. విజయవాడ అమ్మాయి అని.. గోదావరి రాజుల ఫ్యామిలీ అమ్మాయి అని.. ఇలా ఒకటా రెండా.. లెక్కలేనన్ని రూమర్లు, వార్తలు, గాసిప్స్ లు. ఇప్పుడు తాజాగా ఓ వార్త మాత్రం అన్ని సోషల్ మీడియాలో బాగా వస్తోంది. ఈ సారి కచ్చితంగా ఫిక్స్ అయిందని బల్ల గుద్ది మరీ చెబుతోంది సోషల్ మీడియా. హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతున్నాయి.
Read Also : Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి బిగ్ షాక్..
ఆ అమ్మాయి తండ్రికి హైదరాబాద్ లో పలు వ్యాపారాలు ఉన్నాయని.. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇంత బలంగా రావడానికి మరో కారణం కూడా ఉంది. రీసెంట్ గా ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు రామ్ చరణ్ ఓ హింట్ ఇచ్చాడు. ఏపీలోని గణపవరానికి చెందిన ఓ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి అంటూ ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఈ సంబంధం వివరాలు ఉన్నాయని.. ఇది కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో వాస్తవం లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభాస్ పెళ్లిపై ఇలాంటి సింక్ ఉండే కథనాలు లెక్కలేనన్ని వచ్చాయి. ఏదైనా ఉంటే ప్రభాస్ టీమ్ కన్ఫర్మ్ చేయాలి కదా. వాళ్లు ఏదీ చెప్పట్లేదు. రూమర్లపై ప్రభాస్ ఎన్నడూ స్పందించలేదు. ఇప్పుడు కూడా అంతే కాబోలు.