Fauji : ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఫౌజీ. భారీ పీరియాడిక్ మూవీగా దీన్ని దీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నిన్న సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. ఇందులో ఆయన వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన వారంతా తెగ షేర్ చేసేస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక్క దెబ్బకే ప్రభాస్ లుక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీంతో మూవీ టీమ్ సీరియస్ గా స్పందించింది ఈ మూవీ గురించి ఎంతో మంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీకు అద్భుతమైన విజువల్స్ అందించేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. కానీ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయినట్టు తెలిసింది.
Read Also : Balakrishna : కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ
ఇలా చేస్తే మా క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది. అలాగే మా టీమ్ నైతికత దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా ప్రభాస్ లుక్ లీక్ చేసినా, షేర్ చేసినా వాళ్ల ఐడీలు బ్లాక్ చేయడమే కాకుండా సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణించి కేసులు పెడుతాం. తర్వాత జైలుకు వెళ్లాల్సి వస్తుంది అంటూ తెలిపింది మూవీ టీమ్. ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా కనిపిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లీక్ అయిన లుక్ చూస్తుంటే ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. గతంలో కంటే ఇందులో ఫ్రెష్ లుక్ లో ఉన్నాడు. ఈ సినిమా నుంచి త్వరలోనే అప్డేట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎవరికీ తలొంచడు.. బ్రహ్మానందం కామెంట్స్
