Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఓ ప్రభంజనం.. అతని సినిమా వస్తుందంటే పాన్ ఇండియా మొత్తం ఊగిపోవాల్సిందే. రికార్డులు అన్నీ చెరిగిపోవాలి. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల ఊచకోత ఖాయం. అయితే పాన్ ఇండియా ప్రపంచంలో.. సిరీస్ లకు ఓ రేంజ్ లో వైబ్ ఉంది. కానీ ఆ సిరీస్ ల విషయంలో ప్రభాస్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. పాన్ ఇండియా సిరీస్ లలో భారీ క్రేజ్ ఉన్నవి కొన్ని మాత్రమే. అందులో చూస్తే.. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార, కల్కి, సలార్ సినిమాలు ఉంటాయి. ఇందులో మూడు సిరీస్ లు బాహుబలి, కల్కి, సలార్ ప్రభాస్ వే కావడం ఇక్కడ విశేషం. పైగా ఈ మూడు సిరీస్ లు పాన్ ఇండియాలో ఓ ప్రభంజనం.
Read Also : Mahesh Vitta : తినడానికి డబ్బులు లేకుంటే అలా చేసేవాడిని.. మహేశ్ విట్టా ఎమోషనల్
బాహుబలి సిరీస్ అయిపోయింది. ఇప్పుడు కల్కి సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అలాగే సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఆ సీరిస్ లు వస్తే థియేటర్లు ఊగిపోవడం ఖాయం అన్నట్టే ప్రచారం అయితే జరుగుతోంది. మొదటి పార్టులు చాలా పెద్ద హిట్ అయ్యాయి. కాబట్టి రెండో పార్టులు కూడా మంచి హిట్ అవుతాయనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఇలా సిరీస్ లు భారీ హిట్లు చేసిన హీరోగా ప్రభాస్ అందరికంటే ముందే ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు.
Read Also : Chiranjeevi : చిరు-అనిల్ సినిమాలో కాంట్రవర్సీ నటుడే విలన్..?
