టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఎవరైనా ప్రభాస్ పేరే చెబుతారు. ‘బాహుబలి’ సీరీస్ మహాత్మ్యం అది. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాటు ‘సాహో’ బాలీవుడ్ సక్సెస్ ప్రభాస్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ వస్తున్న ప్రభాస్ ని తాజాగా ఓ హాలీవుడ్ సినిమా తలుపు తట్టిందట.
ఇటీవల మేకప్ లేకుండా ‘ఆదిపురుష్’ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ముంబై వెళ్ళిన ప్రభాస్ లుక్ విషయంలో ట్రోల్ కి గురయ్యాడు. అయితే ఇదే సమయంలో ప్రభాస్ ని ఓ హాలీవుడ్ ఆఫర్ పలకరించిందట. ఓటీటీ ప్లాట్ ఫామ్ తో పాటు టీవీ ఛానెల్స్ ఉన్న హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ హారర్ మూవీ ఆఫర్ తో ప్రభాస్ ముందుకు వచ్చిందట. ప్రభాస్ కి ఈ మేరకు స్క్రీన్ ప్లే తో కూడిన స్క్రిప్ట్ పంపిందట. ప్రభాస్ కి లైన్ నచ్చితే పారితోషికం, డేట్స్ వంటి ఒప్పందం కుదుర్చుకోవటానికి సిద్ధంగా ఉందట. నిజానికి హారర్ సినిమాలంటే తనకు భయమని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పాడు. ఒక వేళ ఈ ఆఫర్ కి ఓకె అంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’, ‘సలార్’ షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఆ తర్వాత అశ్వనీదత్ బ్యానర్ లో ‘ప్రాజెక్ట్ కె’ చేయవలసి ఉంది. ఇవి పూర్తవటానికి వచ్చే ఏడాది అవుతుంది. మరి హాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఓకె అంటాడో లేదో కానీ పలువురు స్క్రిప్ట్ లతో మాత్రం ప్రభాస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.