NTV Telugu Site icon

Unstoppable: మీరు ఎన్నడూ చూడని ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ అవుతోంది

Unstoppable Prabhas

Unstoppable Prabhas

Prabhas Gopichand

ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలు ఒకే స్టేజ్ పైన కనిపించబోతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ని ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడు, ఈ బాహుబలి ఎపిసోడ్ ని జనవరి 1న టెలికాస్ట్ చెయ్యబోతున్నారు, ముందెన్నడూ చూడని రికార్డ్స్ ఈ ఎపిసోడ్ చూపించబోతుంది… ఇలా గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు ప్రభాస్ మరియు నందమూరి ఫాన్స్. ఈ బాహుబలి ఎపిసోడ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది, ఈ షూటింగ్ స్పాట్ నుంచి ప్రభాస్ ఫోటోస్ కొన్ని లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Gopichand

దీంతో అన్ స్టాపబుల్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ… “మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. కమింగ్ సూన్” అంటూ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఫొటోస్ కూడా ఉండడం విశేషం. అఫీషియల్ గా బయటకి వచ్చిన ఫోటోస్ లో ప్రభాస్ స్టైలిష్ గా కనిపిస్తే, బాలయ్య అద్దాలని గాల్లోకి ఎగరేస్తూ స్వాగ్ చూపిస్తున్నాడు. గోపీచంద్ ఎప్పటిలాగే కాస్త సైలెంట్ గా సోఫాలో కూర్చోని ఉన్నాడు. ప్రభాస్ తెలుగులో ఒక షోకి రావడం ఇదే మొదటిసారి, ఆయన ఎక్కువ మాట్లాడడు అనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది కానీ గోపీచంద్, బాలకృష్ణలు కలిసి ప్రభాస్ లోని ఫన్ టైమింగ్ ని బయటకి తీసుకోని వచ్చారట. ఇప్పటివరకూ బయట ఎక్కడ కనిపించని ఒక కొత్త ప్రభాస్, అన్ స్టాపబుల్ లో కనిపించబోతున్నాడట. బాలయ్య, గోపీచంద్ లు కలిసి ప్రభాస్ ని మినీ ర్యాగింగ్ కూడా చేశారని సమాచారం. మరి ఈ బాహుబలి ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్యలు చేయబోయే హంగామా ఎలా ఉంటుందో, ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

Show comments