Site icon NTV Telugu

Prabhas: ప్రభాస్ ను అవమానించిన నెట్ ఫ్లిక్స్.. బాలీవుడ్ కోసమేనా..?

Prabhas

Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిన్ననే 42 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన డార్లింగ్ కు ఇండియా మొత్తం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ప్రభాస్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.కాగా, ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సైతం ప్రభాస్ కు విషెస్ తెలిపింది. అయితే ఆ విషెస్ ప్రభాస్ ను అవమానించేలా ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహబలి లో రానాను చంపడానికి ప్రభాస్ పెద్ద రాయిని తీసుకొని అతడిపైకి విసురుతాడు. ఆ ఫోటో ను తీసుకొని నెట్ ఫ్లిక్స్ ఎడిట్ చేసింది.

రాయి ప్లేస్ లో కేక్ పెట్టి.. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అని చెప్పుకొచ్చింది.ఆ ఫోటోను చూస్తుంటే ప్రభాస్ ను ఎగతాళి చేసినట్లు ఉందని చెప్పుకొస్తున్నారు. ఇది కేవలం బాలీవుడ్ హీరోల కోసమే నెట్ ఫ్లిక్స్ చేసిందని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ ఎక్కువగా బాలీవుడ్ కే సపోర్ట్ చేస్తుందని, అందుకే వారి ఆనందం కోసం ఇలా ప్రభాస్ ఫోటోను ఎడిట్ చేసి విషెస్ తెలిపిందని, ఇంత పేరు, పాపులారిటీ పెట్టుకొని నెట్ ప్లిక్స్ ఇలాంటి చీప్ పనులు చేయడం తగదని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక నెట్ ఫ్లిక్స్ నిజంగా కావాలనే ప్రభాస్ పోస్టర్ డిజైన్ చేసిందా లేక వారు పాజిటివ్ గానే ఈ ఫోటో పెట్టారా అన్నది తెలియాల్సి ఉంది.

Exit mobile version