Prabhas: రేయ్.. రేయ్.. ఎవర్రా ఆ పిల్ల.. ప్రభాస్ నే చెంప మీద కొట్టి అట్టా పారిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: అభిమానం ఒక్కసారి మొదలైందంటే ఆపడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనసులో పెట్టుకున్నారంటే చచ్చే వరకు వారిని వదిలిపెట్టరు. ఇక తమ అభిమాన హీరో గానీ, హీరోయిన్ గానీ కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చాలాసార్లు చాలా వీడియోలు చూసాం. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకొంతమంది ఏడుస్తారు.. మరి కొంతమంది గట్టిగా వాళ్ళని పట్టుకొని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. తమ జీవితంలో జరగదు అనుకున్న ఒక మూమెంట్ వారి కళ్ళ ముందు వస్తే ఎవరైనా పట్టరాని సంతోషంలో ఏం చేస్తున్నారో అనేది వారికే తెలియకుండా చేస్తారు. అది సహజమే. ఇక ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఒక అమ్మాయి కూడా అలానే తన అభిమాన హీరోని చూసి ఆనందాన్ని తట్టుకోలేక హీరో చెంప మీదే కొట్టేసి పారిపోయింది. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ కు ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డార్లింగ్ మంచి మనసు కూడా అందుకు ఒక కారణం అని చెప్పాలి. సినిమాల పరంగా కన్నా ఎక్కువగా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే అది అతని వ్యక్తిత్వం వల్లే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Mad: ఏం సాంగ్ రా బాబు.. కాలేజ్ రోజులను కళ్ళముందుకు తీసుకొచ్చేసింది
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇండస్ట్రీలో ఇప్పటివరకు వివాదాలు, విమర్శలు లేని హీరో అంటే ప్రభాస్ అనే చెప్పాలి. ఇక ప్రభాస్ ను చూడడం కోసం ఎంతోమంది అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మూమెంట్ వస్తే ఇదుగో ఇలానే సంతోషంతో ఎగిరిగంతేస్తారు. ఈ వీడియోలో ఉన్న ఒక యువతీ ఎయిర్ పోర్టులో ప్రభాస్ ని చూసి సంతోషంతో గంతులు వేసింది. డార్లింగ్ దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంది. ఫోటోలు దిగింది. అనంతరం ప్రభాస్ తో మాట్లాడుతూ.. వచ్చేటప్పుడు అతని చెంపపై కొట్టేసి పారిపోయింది. దీంతో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షాక్ కు గురయ్యారు. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేసింది అంటూ ఫైర్ అయ్యారు. అయితే నేను చూస్తుంది నిజమా..? అని ప్రభాస్ ను తాకి ఆమె నిజమని గ్రహించి వెనక్కి వచ్చేసిందని, అది సంతోషంగా చేసిన పనే తప్ప వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ మధ్య జరిగిన సంఘటన కాదు.. 2019లో జరిగిన ఘటన కాగా ఇప్పుడు ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి వైరల్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!