Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసే ‘డార్లింగ్’ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతలా అంటే ఆయన పాత సినిమాలు రీ-రిలీజ్ అయినా థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MM థియేటర్ వద్ద జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రీ-రిలీజ్ హంగామా కాస్తా థియేటర్ సిబ్బందికి, అభిమానులకు మధ్య ఘర్షణకు దారితీసింది. అందిన సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన ఒక సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఈ గొడవ చోటు చేసుకుంది. సాధారణంగా రీ-రిలీజ్ సినిమాల్లో ఫ్యాన్స్ కోసం కొన్ని మాస్ సాంగ్స్‌ను రిపీట్ చేయడం లేదా ప్రత్యేకంగా ప్లే చేయడం జరుగుతుంటుంది. ఒక షోలో పాటలు వేసి, మరో షోలో వేయకపోవడంతో అక్కడున్న అభిమానులు థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. మా షోలో కూడా పాటలు వేయాల్సిందేనని పట్టుబట్టారు.
ఈ క్రమంలోనే ఒక అభిమాని అభ్యంతరం తెలపగా, థియేటర్ మేనేజ్మెంట్ సదరు వ్యక్తిపై దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు అభిమానిని సిబ్బంది కొట్టారని, ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఘటనపై మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. కేవలం పాటలు వేయమని అడిగినంత మాత్రాన మేనేజ్మెంట్ దాడి చేయదని, అక్కడ అభిమానులే ఏదైనా అతి చేసి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రీ-రిలీజ్ సమయాల్లో థియేటర్ సీట్లు చించేయడం, స్క్రీన్ల వద్ద బాణాసంచా కాల్చడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వాగ్వాదం జరిగి ఉండవచ్చని, అభిమానుల ప్రవర్తన మితిమీరడం వల్లే గొడవ పెద్దదై ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. థియేటర్ వద్ద గందరగోళం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానిపై దాడి జరగడం నిజమైతే మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!