Kannappa : కన్నప్ప మూవీలో ప్రభాస్ నటిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఈ మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అందుకే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర ఫంక్షన్లకు కూడా ఆయన ఫ్యాన్స్ వెళ్తున్నారు. అయితే కన్నప్ప మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. రచయిత బీవీఎస్ రవి ప్రభాస్ ఎంట్రీని చెప్పేశారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు.
Read Also : Manchu Vishnu: ప్రభాస్ నువ్ నా కృష్ణుడివి, నేను నీ కర్ణుడిని!
ఇంటర్వెల్ తర్వాత 15వ నిముషంలో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని తెలిపాడు. ప్రభాస్ ఎంట్రీ తర్వాత మూవీ మరో లెవల్ కు వెళ్తుందన్నాడు. ప్రభాస్ దాదాపు 26 నిముషాల పాటు తెరమీద కనిపిస్తాడని.. కన్నప్ప మంచి విజయం సాధిస్తుందంటూ తెలిపాడు రవి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమాను ప్రభాస్ కోసమే చూస్తామంటూ ఆయన ఫ్యాన్స్ తెగ కామెంట్లు, పోస్టులు పెట్టేస్తున్నారు.
Read Also : Ghaati : ‘ఘాటీ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..