Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ కాకముందే అరుదైన గౌరవాన్ని అందుకుంది. గత కొన్నిరోజుల నుంచి ప్రాజెక్ట్ కె టైటిల్ ను, ఫస్ట్ గ్లింప్స్ జూలై 20 న రివీల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
Aishwarya Rajesh: వాళ్లు అవకాశాలు ఇవ్వడం లేదు.. అందుకే నేను ఇలా..
ఇక ఆ వార్తలను నిజం చేస్తూ.. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వేడుకలో ఈ ఫస్ట్ గ్లింప్స్ ను, టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా ఇలాంటి అరుదైన గౌరవాన్నీ అందుకోలేదు. అమెరికాలో జూలై 19 నుంచి కామిక్- కాన్ వేడుకలు మొదలు కానున్నాయి. జూలై 20 న ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ను రివీల్ చేయనున్నారు. ఈ వేడుకకు చిత్ర బృందమైన ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, అశ్వినీదత్ తదితరులు పాల్గొననున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ తరుణం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
𝐏𝐑𝐎𝐔𝐃 𝐌𝐎𝐌𝐄𝐍𝐓!
San Diego @Comic_Con, here we come.#ProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/uodkNyPmSk
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 6, 2023