యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 19 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు స్పెషల్ పోస్టర్లు, #19YearsForPrabhas అనే హ్యాష్‌ట్యాగ్‌తో సంబరాలు చేసుకుంటున్నారు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అనతికాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఈశ్వర్” చిత్రం 2002 నవంబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు ట్విట్టర్‌లో ఈ ప్రత్యేకమైన రోజును ఫోటోతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Read Also : వరల్డ్ ఆఫ్ ‘గని’ అంటూ ఆసక్తికర అప్డేట్
ప్రభాస్ మొదటి చిత్రం ‘ఈశ్వర్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘ఈశ్వర్’ నుండి ‘సాహో’ వరకు సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణంలో సినీ ప్రేమికుల హృదయాల్లో ముద్ర వేసిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. యాక్షన్ అయినా, కామెడీ అయినా, రొమాన్స్ అయినా ప్రభాస్ నటుడిగా తన సత్తాను నిరూపించుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఆయన ఖాతాలో ఉన్నాయి. మిర్చి, బాహుబలి, సాహో వంటి హిట్‌లతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్ ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా ఎదిగారు. తెలుగు సినీ ప్రేక్షకులు గర్వపడేలా చేస్తున్న ప్రభాస్ హీరోగా పరిచయమై నేటికి 19 ఏళ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, స్పిరిట్, రాధే శ్యామ్, ప్రాజెక్ట్ కే వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.
