Kannappa : విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం బాగానే కష్టపడుతున్నారు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో నటించిన బిగ్ స్టార్లు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్లకు రాలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా వీరంతా కలిసి పెట్టలేదు. ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్, కాజల్ లలో ఒక్కరు వచ్చినా మూవీ బజ్ అమాంతం పెరుగుతుంది. అందులోనూ ప్రభాస్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే ఫ్యాన్స్ ముందుకు అతి త్వరలోనే ప్రభాస్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : HHVM : ‘వీరమల్లు’ ప్రమోషన్లు ఇంకెప్పుడు..?
ఈ వారం చివరలో కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇండోర్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు ప్రభాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. జూన్ 17న భారీ ఎత్తున ఈవెంట్ చేస్తున్నారంట. ఒకవేళ ట్రైలర్ లాంచ్ కు రాకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కచ్చితంగా వస్తున్నాడంట ప్రభాస్. దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రభాస్ వచ్చిన తర్వాత మూవీపై బజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అటు అక్షయ్ కుమార్ త్వరలోనే మీడియాతో మీట్ నిర్వహించబోతున్నాడు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్ కలిసి కొచ్చిలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. కాజల్ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి కన్నప్ప కోసం అందరూ బాగానే కష్టపడుతున్నారు.
Read Also : Kubera : కుబేర నుంచి ‘అనగనగా కథ’ సాంగ్ రిలీజ్..