యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లంకేశ్వరుడికి బర్త్ డే విషెష్ తెలిపారు. లంకేశ్వరుడు అంటే సైఫ్ అలీఖాన్… “ఆదిపురుష్” సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కన్పించబోతున్న విషయం తెలిసిందే. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Read Also : “7 డేస్ 6 నైట్స్” మేజర్ షెడ్యూల్ పూర్తి
నేడు సైఫ్ అలీ ఖాన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సైఫ్ కు ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సైఫ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రభాస్ “సైఫ్ అలీఖాన్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! “ఆదిపురుష్”లో మిమ్మల్ని చూడాలని ఆతృతగా ఉన్నాను” అంటూ పోస్ట్ చేశారు. 350-400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆదిపురుష్”. దీనిని టి-సిరీస్ కింద క్రిషన్ కుమార్, భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
