NTV Telugu Site icon

Prabhas: కటౌట్ చూసి.. కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్

Salaar

Salaar

Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మరో మూడు రోజులు ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకు అంటారా .. డార్లింగ్ పుట్టినరోజు రేపే కాబట్టి. ప్రభాస్ పియ్యినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చేయబోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా.. ఇప్పటివరకు ఏ హీరోకు జరగిని విధంగా ప్రభాస్ బర్త్ డే పార్టీ ఉండనుంది. ఇప్పటికే ఆ పనులను ఫ్యాన్స్ పూర్తిచేశారు కూడా.. ఇక ఈ రాత్రి నుంచే రెబల్ జాతర మొదలైంది. శ్రేయాస్ మీడియా.. ప్రభాస్ ఫ్యాన్స్ తో కలిసి భారీ కటౌట్ ను ఏర్పాటు చేసింది. దుర్గా పూజ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ ను రేపు లాంచ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి కటౌట్ ను ప్రేక్షకులు కాదు.. ప్రజలు కూడా చూసి ఉండరు.

Gautham Krishna: బిగ్ బాస్ నుంచి రాకముందే హీరోగా ఛాన్స్ పట్టేసిన గౌతమ్

సలార్ లుక్ లో ప్రభాస్ కటౌట్ మరణ మాస్ లా కనిపిస్తుంది. దీనిపై హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అని రాసి ఉంది. రేపు ఉదయం 10.30 కు ఈ కటౌట్ ను ప్రభాస్ ఫ్యాన్స్ లాంచ్ చేయనున్నారు. కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ ఈ బర్త్ డే వేడుకలు జరగనున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇప్పటివరకు ఏ హీరోకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కలేదు. ఇకపోతే రేపు ప్రభాస్ బర్త్ డే కానుకగా.. సలార్, కల్కి సినిమాల నుంచి సర్ప్రైజ్ వీడియోలు రిలీజ్ అవుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇవే కనుక జరిగితే.. రేపు డార్లింగ్ పేరు.. దేశం మొత్తం వినిపిస్తుంది. ఇక ఈ కటౌట్ ను చూసి.. ప్రభాస్ రేంజ్ ఏంటి అనేది నమ్మేయడమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.