Prabhas Becomes The Only Tollywood Hero To Achieve This Record: యంగ్ రెబెల్‌స్టార్ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే.. బాహుబలికి ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాలి. బాహుబలి ముందు వరకు ప్రభాస్ ఒక స్థానిక హీరో, కానీ బాహుబలి తర్వాత అతను పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ పుణ్యమా అని.. అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
Andrapradesh : విజయవాడ లో దారుణం.. అత్తను అతి కిరాతకంగా చంపిన అల్లుడు..!
ఇప్పుడు ప్రభాస్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన ఆదిపురుష్ సినిమా సైతం.. నెగెటివ్ టాక్‌తోనే భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్ తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ వేసుకున్నాడు. బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాల తర్వాత.. యూఎస్ఏలో 3 మిలియన్ డాలర్ల మార్కును దాటిన నాలుగో సినిమాగా ఆదిపురుష్ నిలిచింది. ఒక హీరో నాలుగు సార్లు ఈ ఘనత సాధించడం.. ఒక్క ప్రభాస్‌కే సాధ్యమైంది. మరే ఇతర టాలీవుడ్ హీరోకి ఈ రికార్డు లేదు. ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ రెండుసార్లు.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులు ఒక్కోసారి మూడు మిలియన్ మార్క్‌ని అందుకున్నారు.
Manipur Violence: సైన్యాన్ని ముట్టడించిన 1500 మంది.. 12 మంది మిలిటెంట్ల విడుదల..
కాగా.. ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఆదిపురుష్’ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తెరకెక్కించాడు. రామాయణం బ్యాక్‌డ్రాప్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించాడు. సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరద్మల్ సహాయక పాత్రలు పోషించారు. ఈ సినిమాను టి-సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి.