డైనోసార్ వెనక్కి అడుగు వేస్తుందని తెలియడంతో… మిగతా సినిమాల రిలీజ్ డేట్స్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే సలార్ మేకర్ లాక్ చేసింది గోల్డేన్ డే లాంటిది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు వరుసగా ఐదు రోజులు హాలీడేస్ ఉన్నాయి. మధ్యలో మూడు రోజులు వదిలేస్తే మళ్లీ వీకెండ్ వస్తుంది. కాబట్టి… రెండు వారాల్లో బాక్సాఫీస్ పై సలార్ దండయాత్ర మమూలుగా ఉండదని అనుకున్నారు. సడెన్‌గా సలార్ పోస్ట్ పోన్ అనే న్యూస్ షాకింగ్‌గా మారింది. దీంతో సెప్టెంబర్ 28న కొత్త సినిమాలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే మ్యాడ్ అనే సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక సెప్టెంబర్ 15న రావాల్సిన రామ్ ‘స్కంద’.. సలార్ డేట్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ అక్టోబర్ 19 నుంచి ముందుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. సెప్టెంబర్ 28ని మిస్ చేసుకున్న సలార్ కొత్త రిలీజ్ డేట్ ఏంటనేదే.. ఇప్పుడు ఎగ్జైటింగ్‌గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం సలార్‌కు మూడు కొత్త డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్మస్ టార్గెట్‌గా రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది కానీ సలార్‌కున్న హైప్ కు… ఆ బిజినెస్‌కు సంక్రాంతి అయితే బాగుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే సంక్రాంతికి గుంటూరు కారం, ఈగల్ లాంటి సినిమాలు కర్చీఫ్ వేసేశాయి. ప్రభాస్ ‘కల్కి’ జనవరి 12న డేట్ లాక్ చేసుకొని ఉంది. ఒకవేళ సలార్ వస్తే కల్కి ప్లేస్‌లోనే రావాల్సి ఉంటుంది. అప్పటికీ కుదరకపోతే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న సలార్ రావడం గ్యారెంటీ అంటున్నారు. మేజర్ టాక్ ప్రకారం.. డిసెంబర్ వరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవకపోతే.. రిపబ్లిక్ డేనే నెక్స్ట్ ఆప్షన్ అంటున్నారు. మరి దీనిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. సలార్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అనే విషయం పక్కన పెడితే, అసలు ప్రభాస్ కి బాహుబలి నుంచి ఇప్పటివరకూ చెప్పిన డేట్ కి రిలీజ్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, నెక్స్ట్ రాబోయే కల్కి సినిమాలు కూడా రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే వచ్చాయి. ప్రభాస్ కి మాత్రమే ఇలా ఎందుకు అవుతుందో? ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే ఇంత గుండె ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్లకే తెలియాలి.