ప్రస్తుతం ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చెయ్యాలి, ఆ మార్కెట్ ని టార్గెట్ చెయ్యాలి అనే ప్లానింగ్ తో మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు కానీ అసలు ఈ జనరేషన్ హీరోలకి, ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి 1 అండ్ 2 సినిమాలతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆరున్నర అడుగుల కటౌట్, టోన్డ్ ఫిజిక్, బ్యూటీఫుల్ చార్మ్ ప్రభాస్ సొంతం. బాహుబలి సినిమాలతో ప్రభాస్ క్రేజ్ ఇండియాలో ఏ హీరోకి లేనంత రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది, ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ప్రభాస్‌కు బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే సాహో లాంటి సినిమా తెలుగులో సోసోగానే ఆడినా హిందీలో మాత్రం వసూళ్ల వర్షం కురిపించింది. గత పదేళ్లలో మూడు వేల మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టిన ప్రభాస్, నార్త్ లో ఏకంగా ఖాన్ త్రయంతోనే పోటీ పడుతున్నాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు హిట్ అయి ఉంటే.. ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ వాల్యు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేది.
బాహుబలి 2 తర్వాత రిలీజ్ చేసిన రెండు సినిమాలు ప్రభాస్ కి హిట్ ఇవ్వకపోయినా, ఈ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని మాత్రం డ్యామేజ్ చెయ్యలేకపోయాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు కదా ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’లాంటి అప్ కమింగ్ సినిమాలతో హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ తర్వాత ఆ రేంజులో గుర్తింపు తెచ్చుకున్న మరో రాజమౌళి హీరో రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ మెగా పవర్ స్టార్ ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు. ప్రభాస్-రామ్ చరణ్ లకి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. మెయిన్ గా జపాన్ లో ఈ ఇద్దరు హీరోలకి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా చరణ్… జపాన్ లో ప్రభాస్‌ను సైతం వెనక్కి నెట్టేశాడు. జపాన్‌లో ఇండియా నుంచి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోస్‌గా చరణ్, ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచారు.
లేటెస్ట్‌గా జపాన్‌కి చెందిన మూవీ ప్లస్ అనే ఓ ప్రముఖ ఛానెల్, తమ దేశంలో Most popular Indian Star in Japan? అంటూ ఓ పోల్ నిర్వహించింది. ఈ లెక్కల ప్రకారం రామ్ చరణ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా ప్రభాస్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే వంద కోట్లు రాబట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటించడంతో చరణ్ కి జపాన్ లో క్రేజ్ పెరిగింది. ప్రభాస్ కి కూడా బాహుబలి 2 సినిమాతోనే జపాన్ లో ఫాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ పుట్టిన రోజున, అతన్ని కలవడానికి జపాన్ నుంచి హైదరాబాద్ వస్తారు అంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ థర్డ్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. మరో ఆర్ ఆర్ ఆర్ స్టార్, రజినీకాంత్ తర్వాత జపాన్ లో అంతటి క్రేజ్ ని ఎప్పటినుంచో మైంటైన్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మనది కాని దేశంలో బాలీవుడ్ స్టార్స్‌ని పక్కకు పెట్టేసి.. టాలీవుడ్ స్టార్స్ టాప్ 2లో ఉండడం విశేషం. ప్రస్తుతం చరణ్, శంకర్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తుండగా.. ప్రభాస్ ఏమో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక.. ఒక్క జపాన్‌లోనే కాదు మిగతా దేశాల్లోనూ మనోళ్లు టాప్ ప్లేస్‌లో నిలవడం పక్కా.
//
🎊#インド俳優総選挙 結果発表
\
🥇#ラーム・チャラン
🥈#プラバース
🥉#アーミル・カーン4~10位は画像を✅
投票ありがとうございました✨4/29~5/3放送#ダルバール#シャウト・アウト#ピンク#ジャパン・ロボット#スーパー30
3年目突入
特集:ハマる!#インド映画https://t.co/2GbQHI17DA pic.twitter.com/yV5UDc89jy— ムービープラス【公式】 (@movie_plus) April 12, 2023
https://mobile.twitter.com/ActualIndia/status/1646191033808748544