Prabhas and Nayanthara will be seen as Lord Shiva and Maa Parvati in Kannappa : మంచు హీరో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రత్యేకతాను సంతరించుకుంది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ మధ్య శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి నుపూర్ సనన్ హీరోయిన్ గా నటించలేనని తప్పుకుంది. ఇక ఈ కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చాలా కీలకం. అందుకే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కోరగా ఆయన అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేశారు. ఇక శివుడి పక్కన పార్వతిగా లేడీ సూపర్ స్టార్ నయనతారను నటించమని కోరగా చివరికి ఆమె కూడా ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Geethanjali : గీతాంజలి ఈజ్ బ్యాక్….అక్క నువ్ మళ్లీ వస్తున్నావా?
ఇప్పటికే ఆమెతో కథా చర్చలు కూడా ముగిసాయి, ఇక మరి కొన్ని రోజుల్లో అఫీషియల్ అప్‌డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఒక వేళ నయన్ కూడా ఈ సినిమాలో భాగం అయితే మట్టుకు సినిమా రేంజ్ మరింత పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. యోగి తర్వాత దాదాపు 16ఏళ్ల తర్వాత ప్రభాస్, నయనతార జోడి కట్టనున్న క్రమంలో శివపార్వతులుగా ప్రభాస్, నయనతారను ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్. ఈ వార్త కనుక నిజమైతే.. కన్నప్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నా మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. అయితే వీరే కాక ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది స్టార్లు ఈ సినిమాలో భాగం కాబోతున్నారని అంటున్నారు.