NTV Telugu Site icon

Prabhas: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్- కృతి సనన్ ఎంగేజ్ మెంట్..?

Prabhas

Prabhas

Prabhas: టాలీవుడ్ మోస్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడా..? అని ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. కానీ, డార్లింగ్ మాత్రం పెళ్లి గురించి స్పందించింది లేదు. అయితే గత కొంతకాలంగా ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి.ఈ విషయమై కృతి క్లారిటీ ఇచ్చేసింది. కానీ, ప్రభాస్ మాత్రం నోరు విప్పలేదు. మొన్నటికి మొన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు వచ్చినా ప్రభాస్ మాట జారలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఎటువంటి ప్రేమాయణం లేదని, అవన్నీ రూమర్స్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. పెళ్లి వార్త ఏదైనా ఉంటే కచ్చితంగా అభిమానులతో పంచుకుంటానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇంతగా క్లారిటీ ఇచ్చినా ప్రభాస్- కృతిల పెళ్లి గురించిన వార్తలు మాత్రం తగ్గలేదు. తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ రెండు ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది.

Dhanush: పిక్ ఆఫ్ ది డే.. వారసులతో ధనుష్ ‘సార్’

“బ్రేకింగ్ న్యూస్.. వచ్చేవారం మాల్దీవుల్లో ప్రభాస్- కృతి సనన్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. వారు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ పెళ్లి పుకార్లు మరింత వైరల్ గా మారాయి. ఇక ప్రభాస్ అభిమానులు ఉమైర్ సంధును ఆడుకోవడం మొదలుపెట్టారు. వారి పెళ్లి గురించి కనీసం వారికైనా తెలుసా..? అని కొందరు.. కల్యాణ మండపం నిన్ను బుక్ చేయమన్నరా..? అని మరికొందరు.. లైక్స్ కోసం ఏది వస్తే అది మాట్లాడకు అంటూ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Show comments