Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: ధర్మసంస్థాపన చేయడానికి వస్తున్న భగత్ సింగ్

Pp

Pp

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకొక పక్క రాజకీయ ప్రచారాలు చేస్తూ రెండు పడవలపై పవన్ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక నేడు పవన్ ప్రమాణస్వీకారం విషయం అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి పవన్ కు ప్రముఖలు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అను నేన్ను అంటూ హాష్ టాగ్స్ తో సోషల్ మీడియాని రఫ్ ఆడిస్తున్నారు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.

Also Read; Shanmukh Jaswanth: షన్ను హీరోగా సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో కనిపించాడు. ఇక దీనికి క్యాప్షన్ గా “సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ” అంటూరాసుకొచ్చారు. అంటే ధర్మసంస్థాపన చేయడానికి చెప్పకనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్లో విజయ్ హీరోగా నటించిన తేరి సినిమాకు ఉస్తాద్ రీమేక్ గా తెరకెక్కుతుంది. గతేడాది పవన్ బర్త్ డేకి ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. మరి ఈ చిత్రంతో హరీష్ పవన్ మరో హిట్ ను అందుకుంటారేమో చూడాలి.

Exit mobile version