Site icon NTV Telugu

Bro: ఆ షూ రేట్ ఏంది ‘బ్రో’ అంతుంది?

Bro

Bro

స్టార్ హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే చాలు… వాళ్ల ఫొటోస్ అండ్ వీడియోస్ ని మాత్రమే వైరల్ చేసే వాళ్లు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా వాళ్లు వేసుకున్న డ్రెస్, హ్యాండ్ బ్యాగ్, చెప్పులు… ఇలా ఒకటని లేదు దీని రేట్ ఇంత, దాని ఖరీదు అంత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ గా మారింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యణ్… ఇలా హీరో ఎవరైనా సరే వాళ్లు ఏ డ్రెస్, వేసుకుంటున్నారు ఎంత పెట్టి యాక్ససరీస్ కొంటున్నారు అనేది పక్కాగా తెలుసుకోవాల్సిందే. లేటెస్ట్ గా ఇలాంటిదే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also: Mahesh Babu: ఆ గడ్డ మహేష్ బాబు అడ్డా…

సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ బయటకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు ఉన్న ఈ కొత్త పోస్టర్ మెగా ఫాన్స్ ని ఖుషి చేస్తోంది. అయితే ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ వేసిన ఒక షూ అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ‘బాల్మైన్’ కాంపెనీకి చెందిన ఈ షూ కాస్ట్ అక్షరాలా లక్షా ఆరు వేల డెబ్భై రూపాయలట. ఆ రేంజ్ కాస్ట్ పెట్టి షూ కొనుక్కోగలం అనుకున్న ఫాన్స్ వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకులే అనుకున్న వాళ్లు మాత్రం చూసి ఎంజాయ్ చేయండి.

Exit mobile version