OG: షాకింగ్… ‘పవన్’ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓజి అంటే.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా తమ తమ హీరోలని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా మెగాభిమానులు రామ్ చరణ్‌ను ఓజి అంటుంటారు. అదే టైటిల్‌తో బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓజి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో.. మెగాభిమానులకు ఫుల్ కిక్ ఎక్కింది. అప్పటి నుంచి ఓజి పై రోజు రోజుకి హైప్ క్రియేట్ అవుతునే ఉంది. ఈ మధ్య ఈ సినిమాకు వస్తున్నంత హై మరో సినిమాకు రావడం లేదు. సుజీత్ దర్శకత్వంలో… డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఓజి నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నారు.
కిక్ ఇచ్చే అప్డేట్‌తో ఓజి పై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఓజి షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి కాదనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఓజి అంటే ‘ఓజాస్ గంభీర’ అని తెలుస్తోంది. దాన్నే షార్ట్‌గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా మార్చారని సమాచారం. అయితే ‘ఓజాస్ గంభీర’ అనేది.. సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు అని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఓజి అనే టైటిల్ మాత్రం పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ మూవీలో అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి కూడా నటిస్తుండడం OGపై అంచనాలని మరింత పెంచడంతో పాటు మార్కెట్ వాల్యూకి పెంచింది.
Also Read
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!