పూరీ ‘పేదరికం’ గురించి ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య సోషల్ మీడియాలో పూరీ మ్యూజింగ్స్ ద్వారా పలు ఆసక్తికరమైన అంశాలపై ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘పేదరికం’ గురించి పూరీ మ్యూజింగ్స్ వేదికగా ముచ్చటించారు. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడని.. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతాడని అన్నారు. మీ పిల్లల కోసం.. నా పిల్లల కోసం.. ఏ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలని మనం చూస్తాం.. అది చాలా తప్పు. వాళ్లకి కష్టం తెలియాలి. యుద్ధం తెలియాలి. యుద్ధం నేర్పకపోతే మీ కొడుకు అలెగ్జాండర్ కాలేడు. యుద్ధం చేయాలంటే వాడు కత్తి పట్టాలి. రక్తం చిందాలి.
పేదరికం ఎవరికీ నచ్చదు. అందులో ఉండాలని ఎవరూ కోరుకోరు. మనందరం డబ్బు కావాలని కోరుకుంటాం. దాని కోసం ఎంతో కష్టపడతాం. తప్పులేదు. కానీ ఒక ధనవంతుడిగా నువ్వు ఏదీ నేర్చుకోలేవు. ఒక పేదవాడిగా నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఒక్కసారైనా పేదవాడిగా జీవించండి. కనీసం ఒక్క నెలరోజులైనా వేరే ఊరుకి వెళ్లి మీ కాళ్లపై మీరు నిలబడండి. జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. కష్టం, కన్నీళ్లుకు సరైన నిర్వచనం అర్థమవుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుని మీ అమ్మనాన్నలకు ఇవ్వండి. ఇన్నాళ్లు మీకోసం వాళ్లు ఎంత చేశారో అర్థమవుతుంది. జీవితాంతం ధనవంతుడిగా బతకడానికి ముందు ఒక్కసారి పేదరికం చూడండి. చనిపోయేలోపు ఒక్కసారైన పేదవాడిగా బతకండి. పేదరికం చూడకుండా అస్సలు చావొద్దు అని పూరీ వివరించారు.
Also Read
- Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
- I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
- RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
- Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
తాజావార్తలు
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!