NTV Telugu Site icon

Posani Krishna Murali: జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే

Posani

Posani

Posani Krishna Murali: ఏపీకి సినీ పరిశ్రమ రావటంపై రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు నంది అవార్డుల గురించి జరిగిన సమావేశంలో పోసాని.. కీలక విషయాలను చెప్పుకొచ్చాడు. “సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమైన చేస్తామని జగన్ గతంలోనే చెప్పారు. చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి వంటి వారు వచ్చినప్పుడు స్టూడియోలు కడతా అంటే స్థలం ఇస్తామని జగన్ చెప్పారు. పాతుకు పోయిన తెలుగు ఇండస్ట్రీ రావటం కుదరదు. సినీ నటులు ఏపీకి వచ్చి పోవటం మాత్రమే చేయగలరు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. గతంలో మద్రాస్ లో ఉన్నపుడు తెలుగు వారు ఉన్న చోటుకు అని పరిశ్రమ వచ్చింది. ఇపుడు ఉన్నది తెలుగు గడ్డ మీదే కాబట్టి అక్కడ నుంచి రావటానికి ఆసక్తి చూపరు” అని తెలిపాడు.

Gayathri Gupta: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఫిదా బ్యూటీ..

ఇక పరిశ్రమలో ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలో నటులందరూ ఒక్కటే. జూనియర్ ఎన్టీఆర్ అయినా..జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే. సినిమా ఇండస్ట్రీలో చాలా పేద ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినీ నటులందరికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారితో పాటు సాంకేతిక నిపుణులకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తాం. ఆన్‌లైన్‌లో నటుల వివరాలు అన్ని పొందుపరుస్తాం. ఉచితంగానే నటులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. షూటింగ్‌లకు వెళ్లే సినీ నటుల కోసం బస్సు రాయితీ ప్రతిపాదనపై చర్చిస్తున్నాం. ఇండియాలో ఇది ఫస్ట్ టైమ్. ఎక్కడ కూడా ఇలాంటి రాయితీలు పెట్టలేదు. ఇకనుంచి నటుల ఎంపిక కూడా మా వెబ్ సైట్ లో చూడొచ్చు. అందరి ఫోటోలను అందులో ఉంచుతాం. నటులు అని నొక్కగానే వేలమంది నటులు మీకు కనిపిస్తారు.. మీకు ఎంతమంది కావాలో.. అందులోనే సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని నేను మద్రాస్ లో చూసాను ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.