రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలపై నటుడు పోసాని కృష్ణ మురళీ కౌంటర్ అటాక్ ఇచ్చారు. పవన్ లేవనెత్తిన ప్రతి ప్రశ్నను పోసాని సమాధానాలు ఇస్తూ, అదే సమయంలో మరిన్ని ప్రశ్నలను పవన్ కు సంధించాడు.
ఓరేయ్ సన్నాసుల్లారా.. వెధవల్లారా? అంటూ ముఖ్యమంత్రి, మంత్రులను తిడతాడా? అంటూ పోసాని ప్రశ్నించాడు. దిల్ రాజు రెడ్డి.. మీరు రెడ్డి ఆయన రెడ్డి.. మీరు మీరు మాట్లాడుకోండి అని అంటారా? ఇది ఎవరు మాట్లాడాల్సిన మాటలు.. ఆయనకు కులపిచ్చి ఉందని ఎవ్వరైనా నిరుపిస్తారా? ఆయనతో ఎప్పటికీ పోల్చుకోకు. పులివెందులకు వెళ్లకపోయినా ఆయన గెలుస్తారు. పవన్ అలా ఏదైనా నియోజకవర్గానికి వెళ్లకుండా గెలుస్తావా? గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావ్ కదా? అంటూ పోసాని ఎద్దేవా చేశారు.
ఆనాడు చంద్రబాబు చేసిన అప్పులకు ఈనాడు జగన్ ప్రభుత్వం వడ్డీలు కడుతూ.. మరోపక్క సేవలు చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. బాబు లాగా విదేశీ పర్యటనలు చేయకుండా.. జగన్ చక్కని పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబుకు కాపుల మీద నిజంగా ప్రేమ ఉందా పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నించాడు. బాబు ఎస్సీ, ఎస్టీలను తిట్టలేదా అంటూ పోసాని కామెంట్స్ చేశారు. ఇన్ని గ్రేట్ మిస్టేకులను ఏనాడైనా ప్రశ్నించావా పవన్..? అంటూ పోసాని విరుచుకుపడ్డారు.
