Site icon NTV Telugu

Poornodaya Pictures :’ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటున్న పూర్ణోదయ

First Day Jpg

First Day Jpg

తెలుగు చిత్రసీమలో పూర్ణోదయ సంస్థకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. నాటి ‘తాయారమ్మ బంగారయ్య’ నుంచి ‘ఆపద్భాందవుడు’ వరకూ పలు క్లాసికల్ చిత్రాలను నిర్మించిన ఘనత ఈ సంస్థది. ‘శంకరాభరణం, సితార, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి’ వంటి సినిమాలు ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ సంస్థ 30 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో మనవరాలు శ్రీజ ఏడిద నిర్మాతగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కథతో వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. దీనికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ టైటిల్ ను ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. రదన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో తొలి కాపీ సిద్ధం చేసి విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు. పూర్ణోదయ సంస్థ రీఎంట్రీలోనూ విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు అనుదీప్, నాగ్ అశ్విన్.

Exit mobile version