AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం AA23 గురించి నిత్యం ఏదో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ కనగరాజ్ ఏమాత్రం ఆలస్యం చేయకూడదని పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ బజ్ ప్రకారం లోకేష్ తన అసిస్టెంట్ డైరెక్టర్ల టీమ్‌ను రెండు టీమ్స్ గా సెపరేట్ చేసి ఒక టీమ్ హైదరాబాద్‌లోనే ఉండి స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ సెర్చింగ్ మరియు లోకల్ పనులను పర్యవేక్షిస్తుంటే మరొక టీమ్ చెన్నైలో ఉండి సాంకేతిక చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్, డిజైనింగ్ పనులను చకచకా చేస్తోందట.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త లీకైంది. బన్నీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ కలసి చేసిన దువ్వాడ జగన్నాథమ్, అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధించాయి. ఇప్పుడు మూడోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోందని టాక్. తాజా నివేదికల ప్రకారం ఇటీవల బన్నీ, పూజపై లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ లుక్ టెస్ట్ అవుట్‌పుట్ టీమ్‌కు బాగా నచ్చడంతో దాదాపుగా పూజా హెగ్డే పేరు ఖరారైనట్లేనని చెప్తున్నారు. ఈ వార్త నిజమైతే లోకేష్ మార్క్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బన్నీ-పూజా జోడీని మళ్లీ చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి.
Also Read
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!