AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్

Bunni Pooja Hegde

Bunni Pooja Hegde

మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం AA23 గురించి నిత్యం ఏదో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ కనగరాజ్ ఏమాత్రం ఆలస్యం చేయకూడదని పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ బజ్ ప్రకారం లోకేష్ తన అసిస్టెంట్ డైరెక్టర్ల టీమ్‌ను రెండు టీమ్స్ గా సెపరేట్ చేసి ఒక టీమ్ హైదరాబాద్‌లోనే ఉండి స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ సెర్చింగ్ మరియు లోకల్ పనులను పర్యవేక్షిస్తుంటే మరొక టీమ్ చెన్నైలో ఉండి సాంకేతిక చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్, డిజైనింగ్ పనులను చకచకా చేస్తోందట.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త లీకైంది. బన్నీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ కలసి చేసిన దువ్వాడ జగన్నాథమ్, అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధించాయి. ఇప్పుడు మూడోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోందని టాక్. తాజా నివేదికల ప్రకారం ఇటీవల బన్నీ, పూజపై లుక్ టెస్ట్‌ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ లుక్ టెస్ట్ అవుట్‌పుట్ టీమ్‌కు బాగా నచ్చడంతో దాదాపుగా పూజా హెగ్డే పేరు ఖరారైనట్లేనని చెప్తున్నారు. ఈ వార్త నిజమైతే లోకేష్ మార్క్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో బన్నీ-పూజా జోడీని మళ్లీ చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి.