NTV Telugu Site icon

Pooja Hegde: పూజకు గురూజీ నుంచి పిలుపు… పాన్ ఇండియా ఛాన్స్?

Pooja Hegde

Pooja Hegde

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… హీరోయిన్లను రిపీట్ చేస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే.. చివరగా అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డేను ‘మహేష్ బబు ‘గుంటూరు కారం’ సినిమాలో తీసుకున్నాడు. పూజా పై చాలా సీన్స్ కూడా షూట్ చేశాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయింది పూజా. త్రివిక్రమ్ తప్పించాడా? లేక అమెనే తప్పుకుందా? అనేది పక్కన పెడితే… ఇక పై మాటల మాంత్రికుడి సినిమాలో పూజాకు ఛాన్స్ ఉండదని ఫిక్స్ అయిపోయారు. అలా అనుకున్న వారికి షాక్ ఇస్తూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ఆఫర్‌ను పూజా ముందు పెట్టాడట త్రివిక్రమ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కానీ ఇంకా త్రివిక్రమ్ ఆ వైపు అడుగులు వేయలేదు. గుంటూరు కారం రీజనల్ లెవల్లోనే తెరకెక్కుతోంది.

నెక్స్ట్ రాజమౌళి సినిమాతో పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అందుకే.. అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఇటు గుంటూరు కారం, అటు పుష్ప2 అయిపోగానే బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఈసారి పాన్ ఇండియాను టార్గెట్ చేశారు బన్నీ, త్రివిక్రమ్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. గుంటూరు కారంలో ఛాన్స్ మిస్ అయినందుకే.., పూజకు త్రివిక్రమ్ ఈ పాన్ ఇండియా ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే… ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేని పూజకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.