Arabic Kuthu challenge : అదరగొట్టేసిన పూజాహెగ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన “బీస్ట్”లోని పెప్పీ ట్రాక్ “అరబిక్ కుతు” సోషల్ మీడియా ఛాలెంజ్‌గా మారింది. చాలా మంది ప్రముఖులు, ప్రేక్షకులు ఈ సాంగ్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే కూడా ఈ ట్రెండ్‌లో చేరింది. తన తాజా మాల్దీవుల పర్యటనలో పూజా ఒక పడవలో “అరబిక్ కుతు” ఛాలెంజ్ చేస్తూ కన్పించింది. అదిరిపోయే స్టెప్పులతో పాటు ఆమె లుక్ కూడా అద్భుతంగా ఉండడంతో అభిమానులు ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. “అరబిక్ కుతు” సాంగ్ విషయానికొస్తే… అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ఈ పాటను అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీ పాడారు. శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. ‘అరబిక్ కుతు’ అనేది అరబిక్ సంగీతం,తమిళ కుతు బీట్ల కలయికతో వచ్చిన సాంగ్. ఇప్పుదు సోషల్ మీడియాలో ఈ “అరబిక్ కుతు” ఛాలెంజ్ సంచలనంగా మారింది.
Read Also : 45 ఏళ్ళ ‘సావాసగాళ్ళు’
Also Read
ఇక పూజా హెగ్డే, తలపతి విజయ్ మొదటిసారిగా ‘బీస్ట్’లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత పూజా హెగ్డే తమిళ చిత్రసీమలోకి తిరిగి అడుగు పెట్టబోతోంది. ఈ నటి చివరిగా 2012లో మిస్కిన్ ‘ముగమూడి’ అనే తమిళ చిత్రం చేసింది. ఇక బ్లాక్ కామెడీ ‘బీస్ట్’కు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, వీటీవీ గణేష్, అపర్ణా దాస్, లిల్లిపుట్ ఫరూఖీ, అంకుర్ అజిత్ వికల్, సతీష్ కృష్ణన్, రెడిన్ కింగ్స్లీ మరియు జార్న్ సుర్రావ్లు సహాయక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు.
Do the #HalamithiHabibo with @hegdepooja@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @Siva_Kartikeyan @jonitamusic @manojdft @Nirmalcuts #Beast #BeastFirstSingle #ArabicKuthuChallenge pic.twitter.com/CsHfOEqe70
— Sun Pictures (@sunpictures) February 15, 2022
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!