Site icon NTV Telugu

Pooja Hegde: బుట్టబొమ్మకు ఆ సమస్య వలన ఇబ్బందులు తప్పడంలేదట

pooja hegde

pooja hegde

టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక పక్క టాలీవుడ్ సినిమాలో నటిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను ఛాన్సులు పట్టేస్తుంది. దీంతో అమ్మడి కాల్షీట్లు అస్సలు ఖాళీగా లేవంట. ఇక మొదటిసారి పూజా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్స్ అన్ని జరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇదివరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించిన మేకర్స్ ఈసారి కూడా భారీ సెట్ వేసి మరి అభిమానుల మధ్య జరపనున్నారట. ఈ మూవీ రిలీజ్ కు ఈ ఈవెంట్ ని దాదాపు రెండు వారాల ముందు జరపాలని ఏర్పాట్లు చేస్తున్నారట.అయితే ఈ ఈవెంట్ కి బుట్ట బొమ్మ హ్యాండ్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. డేట్స్ అడ్జస్ట్ చేయలేకే పూజా హెగ్డే సతమతమవుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీనివల్లనే మేకర్స్ కి పూజ సపోర్ట్ చేయలేకపోతున్నదట. ఇకపోతే ప్రస్తుతం పూజా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. వచ్చిన వెంటనే బాలీవుడ్ మూవీ షూటింగ్ లో హాజరుకానుంది.

Exit mobile version